Naa Tandri Neeke Song Lyrics | నా తండ్రి నీకే Song Lyrics | Telugu Christian Songs Lyrics

Details | Name |
---|---|
Lyrics Writer | K.JOSEPH |
Vocals/Singer | K.Bala Showry |
ప: నా తండ్రి నీకే నా వందనము - వేలాది స్తోత్రములు
నీవు చేసిన ప్రతి మేలుకు - ఎనలేని కృతజ్ఞతలు
1 జగతికి పునాది వేయక మునుపే
నీ ప్రేమలో నన్ను ఏర్పరచుకొంటివి
మరణమైన జీవమైన
నీ కొరకే నే జీవించెదను
నీ అడుగు జాడలలో నే నడచుకొందును
2 ఎన్నికరావే ధనరాశులెన్నైన
నీ వాత్సల్యత మాధుర్యమైనది
నీవిచ్చు ప్రతివరము బహు శ్రేష్టమైనది
నీ నామ ఘనతకే జీవించెదను
నీతి కిరీటము నే పొందెదను