Innelluga Matho Song Lyrics | ఇన్నేళ్ళుగా మాతో Song Lyrics | Christian Worship Songs Lyrics

Details | Name |
---|---|
Lyrics Writer | Nissy Paul |
Vocals/Singer | Nissy Paul |
ఇన్నేళ్ళుగా మాతో ఉండి నడిపించవయ్యా..
నీ బాహువు మాకు తోడుగా ఉంచి రక్షించావయ్యా
నీ కృప చేత కీడుల నుండి తప్పించవయ్యా..
ఎడబాయని నీ కృప మా యెడల చూపావేసయ్యా
నీకే ఆరాధన చెల్లించెద యేసయ్య
నీకే స్తోత్రార్పణ అర్పించెద యేసయ్య
1 నీ వాత్సల్యము చేత మమ్మును నడిపించావు..
దినదినము నీ కృప చూపి నీలో భద్రపరిచావు (2)
ఏ తెగులైనా తాకనీయక సంరక్షించావు
మా కన్నీటిని తుడిచి ఆదరణగ నిలిచావు (2)
నీకే ఆరాధన చెల్లించేద యేసయ్య
నీకే స్తోత్రార్పణ అర్పించెద యేసయ్య
2 ఎన్ని యుగాలకైనా నీవే మా దైవము
మా ఆయుష్కాలము వరకు నిన్నే పూజింతుము(2)
పరిశుద్ధుడా.. అతి పరిశుద్ధుడా.. మా ప్రభు యేసయ్య
ఈ విశ్వములోనా నీకు సాటి లేనే లేదయ్యా(2)
నీకే ఆరాధన చెల్లించేద యేసయ్య
నీకే స్తోత్రార్పణ అర్పించెద యేసయ్య