Yese Na Ghana Daivama Song Lyrics | యేసయ్య నా ఘన దైవమా Song Lyrics | Telugu Christian Songs Lyrics

Details | Name |
---|---|
Lyrics Writer | Bro. Shalem Raj |
Vocals/Singer | Bro. Shalem Raj |
యేసయ్య నా ఘన దైవమా
నా అభిషేక తైలమా -
ఆనంద సంగీతమా 2
నీకే నా స్తోత్రం స్తోత్ర సింహాసనం 2
1.నా ప్రార్థనలను ఆలించువాడవు
ప్రార్థనలన్ని నెరవేర్చువాడవు -2
మాట తప్పని దేవుడవు నీవు -2
మదిలో వ్యధను తొలగించిన -2 / నీకే/
2. నా గాయములను మాన్పు వాడవు
నూతన బలమును
దయచేయు వాడవు -2
మనస్సును గెలిచిన మగధీరుడవు -2
మనవులన్ని మన్నించిన -2 / నీకే/
3. నా శత్రువు లను ఎదురించువాడవు
ముందు నిలిచిన నజరేయుడవు -2
ప్రేమను పంచిన త్యాగ ధనుడవు -2
హృదయమందు నివశించిన -2/ నీకే/