Ontari Ne Kanayya Song Lyrics | ఒంటరి నే కానయ్యా Song Lyrics | Telugu Christian Songs Lyrics

Details | Name |
---|---|
Lyrics Writer | DD Anand |
Vocals/Singer | Mohammed Irfan |
ఒంటరి నే కానయ్యా - యేసయ్యా - ఒంటరి నే కానయ్యా
నీ దయ వుండగా - కృప తోడై నడువగా
దయ వుండగా-కృప తోడై నడువగా
హల్లెలూయా - స్తోత్రమూ - యేసయ్యా - నీ నామమే అభయమూ
1: చీకటి నన్నూ తరిమిననూ - కష్టాలు అలలై ముంచిననూ
భయపడదూ - నా హృదయం - నీ బలమైన హస్తమే - ఆయుధమవగా
బలమైన హస్తమే – ఆశ్రయమవగా
2: ఓటమిలా కనిపించిననూ - మాటలు అగ్నియై కాల్చిననూ
వెనుకకు పడదూ నా అడుగూ-మార్గము నీవై పయనం సాగూ
3: ఆగని పరుగులా సాగిననూ - ఆపద గాలులై వీచిననూ
పడిపోలేదూ - నా జీవితం- క్రీస్తే పునాదియై- మందిరమవగా
క్రీస్తే పునాదియై- ఆలయమవగా
4: ఎవ్వరు లేరని అనలేనుగా - మహిమ మేఘమే – తోడవగా
మెల్లనీ - నీ స్వరమూ - నా ధైర్యమై - సాక్షిగా వెడలుచుండగా