NeNevarino Nenemito Song Lyrics | నేనెవరినో నేనేమిటో Song Lyrics | Christian Songs Lyrics

Details | Name |
---|---|
Lyrics Writer | Bro. Manoj Kothuri |
Vocals/Singer | Abhay Jodhpurkar |
పల్లవి :
నేనెవరినో నేనేమిటో ఎందుకింత ప్రేమ
ఏ యోగ్యత లేని నన్ను కృపతో ఎన్నుకొన్నావు
ఏ అర్హత లేని నన్ను నీ దరికె చేర్చుకొని
నీ ఆత్మతో నడిపించావు వారసత్వమునిచ్చావు
Chorus:
తండ్రీ నా దేవా నా సర్వం నీవయ్యా
నీ ప్రేమే చాలయ్య సర్వోన్నతుడా దేవా
చరణం 1:
నేల మంటితో మలిచి నీ రూపమే నాకిచ్చి
నీ స్వాశతో నన్ను నింపి నాకు ఊపిరి పోసి
నా ద్యాస నా ప్రతి ఆశ నీవే నా దేవా
నీ శాశ్వత ప్రేమే కదా నిరతం నా తోడు
తండ్రీ దేవా నీవే సర్వము
Chorus:
తండ్రీ నా దేవా నా సర్వం నీవయ్యా
నీ ప్రేమే చాలయ్య సర్వోన్నతుడా దేవా
దేవా నా సృష్టికర్తా నీకే స్తోత్రం
నా రాజా మహోన్నతుడా నీకే స్తోత్రం
నా ధ్యానం నీవే ప్రభు
నా గానం నీకే సొంతము
చరణం 2:
నను ఇంతగా ప్రేమించి మరింతగా ఆదరించి
నా పాపములు క్షమియించి నిత్యజీవమిచ్చావూ
ఏమిచ్చి నీ ఋణమును నే తీర్చనూ
అర్పించెద నా సమస్తము నీకే అంకితం
తండ్రీ దేవా నీవే సర్వము
Chorus:
తండ్రీ నా దేవా నా సర్వం నీవయ్యా
నీ ప్రేమే చాలయ్య సర్వోన్నతుడా దేవా
చరణం 3:
నా హృదయాలం - నీ రాకతో ఉప్పొంగెనే
ఎల్లప్పుడు చేసేదనేను ఉత్సాహ గానమే
ఘనుడా ఉన్నతుడా నా హృదయార్పణ నీకే
కొలిచెద కీర్తించెద నిన్నే జీవితాంతమూ
తండ్రీ దేవా నీవే సర్వము
Chorus:
తండ్రీ నా దేవా నా సర్వం నీవయ్యా
నీ ప్రేమే చాలయ్య సర్వోన్నతుడా దేవా