Satilenidi Yesuni Rakthamu Song Lyrics | సాటిలేనిది యేసుని రక్తము Song Lyrics | Telugu Christian Songs Lyrics | Zion Songs
సాటిలేనిది యేసుని రక్తము
పాపమును కడుగును ప్రియుడా
పాపమునే కడుగును
1 చూడుము సోదరా దేవుడు ఎంతో
ప్రేమించె నీ జగతిన్ ప్రియుడా
ప్రేమించె నీ జగతిన్
సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు
యేసుని పంపెను ప్రియుడా
యేసుని పంపెను ||సాటి||
2 లోకమున కరుదెంచి క్రీస్తు ప్రభువు
ప్రాణము బలిగా నిచ్చె ప్రియుడా
ప్రాణము బలిగా నిచ్చె
లోక పాపమెల్ల సిలువలో మోసి
తొలగించె శాపముల్ ప్రియుడా
తొలగించె శాపముల్ ||సాటి||
3 వినుము సోదరా ప్రభు యేసు క్రీస్తుని
పరలోక వార్తను ప్రియుడా
పరలోక వార్తను
ఉన్నతమైన పరలోక ప్రేమను
చాటించుచుంటిమి ప్రియుడా
చాటించు చుంటిమి ||సాటి||
4. యేసుని నీవు క్షమించుమనివేడు
విరిగిన హృదయముతో ప్రియుడా
విరిగిన హృదయముతో
యేసుని అమూల్యరక్తధారలే
కడుగును పాపమెల్ల ప్రియుడా
కడుగును పాపమెల్ల ||సాటి||
5. పాప భారమును మోసికొని నీవు
ప్రయాస మొందెదవా ప్రియుడా
ప్రయాస మొందెదవా
పాపమొప్పుకొని యేసు పాదముల
చెంతకు చేరుమా ప్రియుడా
చెంతకు చేరుమా ||సాటి||
6. గతించుచున్నది స్వల్ప జీవితము
శీఘ్రముగా రమ్ము ప్రియుడా
శీఘ్రముగా రమ్ము
కర్త యేసు నందు విశ్వాసముంచి
రక్షణ పొందుము ప్రియుడా
రక్షణ పొందుము ||సాటి||
7. కృప, ఆనందము, పవిత్ర ప్రేమలో
భాగము పొందుము ప్రియుడా
భాగము పొందుము
పాప సాగరము దాటించగలడు
యేసు రక్షకుడే ప్రియుడా
యేసు రక్షకుడే ||సాటి||
పాపమును కడుగును ప్రియుడా
పాపమునే కడుగును
1 చూడుము సోదరా దేవుడు ఎంతో
ప్రేమించె నీ జగతిన్ ప్రియుడా
ప్రేమించె నీ జగతిన్
సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు
యేసుని పంపెను ప్రియుడా
యేసుని పంపెను ||సాటి||
2 లోకమున కరుదెంచి క్రీస్తు ప్రభువు
ప్రాణము బలిగా నిచ్చె ప్రియుడా
ప్రాణము బలిగా నిచ్చె
లోక పాపమెల్ల సిలువలో మోసి
తొలగించె శాపముల్ ప్రియుడా
తొలగించె శాపముల్ ||సాటి||
3 వినుము సోదరా ప్రభు యేసు క్రీస్తుని
పరలోక వార్తను ప్రియుడా
పరలోక వార్తను
ఉన్నతమైన పరలోక ప్రేమను
చాటించుచుంటిమి ప్రియుడా
చాటించు చుంటిమి ||సాటి||
4. యేసుని నీవు క్షమించుమనివేడు
విరిగిన హృదయముతో ప్రియుడా
విరిగిన హృదయముతో
యేసుని అమూల్యరక్తధారలే
కడుగును పాపమెల్ల ప్రియుడా
కడుగును పాపమెల్ల ||సాటి||
5. పాప భారమును మోసికొని నీవు
ప్రయాస మొందెదవా ప్రియుడా
ప్రయాస మొందెదవా
పాపమొప్పుకొని యేసు పాదముల
చెంతకు చేరుమా ప్రియుడా
చెంతకు చేరుమా ||సాటి||
6. గతించుచున్నది స్వల్ప జీవితము
శీఘ్రముగా రమ్ము ప్రియుడా
శీఘ్రముగా రమ్ము
కర్త యేసు నందు విశ్వాసముంచి
రక్షణ పొందుము ప్రియుడా
రక్షణ పొందుము ||సాటి||
7. కృప, ఆనందము, పవిత్ర ప్రేమలో
భాగము పొందుము ప్రియుడా
భాగము పొందుము
పాప సాగరము దాటించగలడు
యేసు రక్షకుడే ప్రియుడా
యేసు రక్షకుడే ||సాటి||