Type Here to Get Search Results !

Ninnaye Kada Song Lyrics | నిన్నయే కదా మనిషి నీ బ్రతుకు Song Lyrics | Telugu Christian Songs Lyrics | Telugu Gospel Songs

Ninnaye Kada Song Lyrics | నిన్నయే కదా మనిషి నీ బ్రతుకు Song Lyrics | Telugu Christian Songs Lyrics | Telugu Gospel Songs

Ninnaye Kada
నిన్నయే కదా మనిషి నీ బ్రతుకు
రేపు ఏమి జరుగునో తెలియదు నీకు ॥2॥
కురిసిన వర్షం మరల కురవక ముందే
తేజస్సుకు చీకటి కమ్మకముందే ॥2॥
ప్రభుని నమ్ముకో పరలోకం చేరుకో
॥ నిన్నయే కదా మనిషి నీ బ్రతుకు ॥


అంకెలలో లేదయ్యా నీ జీవితం
నీ కాల గతులు యెహోవా వశం ॥2॥
నీ అరచేతులో గీతలు నీ తలరాతలు కాదు
ఆ గీతలే లేకుంటే చేయి ముడుచు కోదు ॥2॥
అధికముగా ఆలోచించి /
అలసిపోకు సోదరా
నీ బలహీనత గమనించి /
జ్యోతిష్యపు మాయరా
॥ నిన్నయే కదా మనిషి నీ బ్రతుకు ॥

నిన్నయే కదా మనిషి నీ బ్రతుకు
రేపు ఏమి జరుగునో తెలియదు నీకు ॥2॥
కురిసిన వర్షం మరల కురవక ముందే
తేజస్సుకు చీకటి కమ్మకముందే ॥2॥
ప్రభుని నమ్ముకో పరలోకం చేరుకో
॥ నిన్నయే కదా మనిషి నీ బ్రతుకు ॥


చచ్చిన సింహముకంటే /
బ్రతికియున్న కుక్క మేలు
సింహమైన చచ్చునని /
యెరిగి బ్రతికితే చాలు ॥2॥
బలము ధనము స్థిరము కాదు ఎరుగుము
ప్రేమా సత్యములో /
చివరి వరకు ఎదుగుము ॥2॥
మనసూ దేవునికిచ్చి మహిమలోకి చేరుము
ఆత్మతో ఆరాధించి దేవుని కృప పొందుము
॥ నిన్నయే కదా మనిషి నీ బ్రతుకు ॥


నీవంశము వృక్షమై శాఖలుగా ఎదిగినా
లోకమంత నీముందు భీతితో ఒదిగినా ॥2॥
అధికారివె అయినా ఐశ్వర్యమెంత ఉన్నా
రాజువైన మరణానికి దాసుడవే అన్నా ॥2॥
నీ దేహము ప్రభువుకు సజీవముగ అర్పించు
తీర్పులోకి రాకుండ నీ ఆత్మను తప్పించు
॥ నిన్నయే కదా మనిషి నీ బ్రతుకు ॥


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area