Type Here to Get Search Results !

నిన్ను నేను విడువను దేవ Song Lyrics | Ninnu nenu viduvanu deva song lyrics - Andhra Kraistava Keerthanalu Lyrics - Old christian song lyrics

Top Post Ad

నిన్ను నేను విడువను దేవ Song Lyrics | Ninnu nenu viduvanu deva song lyrics - Andhra Kraistava Keerthanalu Lyrics

నిన్ను నేను విడువను దేవ నీవు నను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవ

నిన్ను నమ్మినవారల నెల్ల నీవు చక్కఁగ దీవించెదవు|| నిన్ను నేను ||

నేను శత్రువునై యుండంగ నీవు నాపై నెనరు జూపి దాన మిచ్చితివి నా కొరకు దారుఁడౌ నీ ప్రియ పుత్రుని|| నిన్ను నేను ||

త్రోవ దప్పి తిరుగుచుండ దుడుకునైన నన్ను ఁ గాంచి ప్రోవ(గోరి మదిని నీవు త్రోవను బెట్టితివి నన్ను|| నిన్ను నేను ||

నాఁటనుండి నేఁటి వరకు నాకుఁ గల్గిన శోధనములలో నేటుగా ననుఁ గాచిన వాఁడవు నీవు గావా, ఓ నా తండ్రి|| నిన్ను నేను ||

ఇంత కాలము నన్నుఁ గాచి యిఁకను నన్ను విడువ వనుచు సంత సించి మదిని నేను జక్కఁగ నీ దరి జేరితిని|| నిన్ను నేను ||

నీవు గాక యెవరున్నారు నేలపైని ననుఁ గాపాడఁ చేవ లేని నాకు నీవు చేవ గలుగఁ జేయఁ గలవు|| నిన్ను నేను ||

అడుగు వారి కిచ్చెద నంచు నాన తిచ్చినావు గాన నడిగెద నిను సాహాయ్యంబు నాత్మమై యున్నట్టి తండ్రి|| నిన్ను నేను ||

నాదు ప్రార్థన లన్నియి నీవు నీదు కృపచే నాలకించి నీదు సరణిని నిల్పి నన్ను నేర్పు దనరఁగ రక్షించితివి|| నిన్ను నేను



Below Post Ad

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Ads Area