విలువైనది నీ సిలువ ప్రేమ Song Lyrics | Viluvainadi Nee Siluva Song Lyrics - Calvary Ministries Songs Lyrics

పల్లవి: విలువైనది నీ సిలువ ప్రేమ
వెల ఇవ్వలేనిది విలువైన నీ ప్రేమ
నా శిక్ష భరించి నన్ను విడిపించినది
నా బదులు మరణించి నన్ను బ్రతికించినది
బాధింపబడుచు బదులు పలుక లేనిది
గాయముల నొందుచు మౌనియైపోయినది
1. నా పాప భారమంతా నీ మీద మోపబడెనె
సొగసైన నీ స్వరూపం రూపులేనిదాయెనె -2
నా అపరాధములె నిన్ను నలగగొట్టెనే
అన్యాయమైన తీర్పు నా కొరకు నొందితివే
ఏమంత నామీద నీకింత ప్రేమ
నే మరువలేనయ్య నీ సిలువ ప్రేమ
2. నా రోగములను భరించి నీవు గాయపడితివే
నా వ్యాధి బాధలన్నీ నీమీద మోసితివే -2
నా వ్యసన క్రియలనుబట్టి బాధింపబడితివే
నే స్వస్థత నొందుటకు నీవు దున్నబడితివే
ఏమంత నామీద నీకింత ప్రేమ
నే మరువలేనయ్య నీ సిలువ ప్రేమ
3. నా శాపము బాపుటకు నా కొరకు శాపమై
నన్ను దీవించుటకు మ్రాను మీదికెక్కితివే -2
ధనవంతుడైన నీవు దారిద్రత నొందితివే
నన్ను ధనవంతుని చేయ నీ కృపను ఇచ్చితివే
ఏమంత నామీద నీకింత ప్రేమ
నే మరువలేనయ్య నీ సిలువ ప్రేమ...