నూతనమైనది | Noothanamainadi - Sis. Lilian | Telugu Christian Songs Lyrics
Singer | Sis. Lilian |
నూతనమైనది నీ వాత్సల్యము..
ప్రతి దినము నన్ను దర్శించేను
ఏడాబాయనిది నీ కనికరము
నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను
దినములు గడుచుచున్నను నీ ప్రేమలో మార్పులేదు ||2||
సన్నుతించెదను నా యేసయ్య
సన్నుతించెదను నీ నామమును||2||
గడచిన కాలమంత
నీ కృపచూపి ఆదరించినావు జరుగబోయే కాలమంత
నీ కృపలోన నన్ను దాచేదవు ||2||
విడువని దేవుడవు
యెడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు ||2||
||సన్నుతించెదను||
నా హీనదశలో నీప్రేమచూపి పైకిలేపినావు
ఉన్నత స్థలములలో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినావు |2|
మరువని దేవుడవు నన్ను మరువలేదు
నీవు ఏ సమయమందైనను చేయి విడువవు ||2||
||సన్నుతించెద||
నీ రెక్కలక్రింద నన్ను దాచినావు
ఆశ్రయమైనావు నా దాగు స్థలముగా
నీవుండినావు సంరక్షించావు||2||
ప్రేమించే దేవుడవు తృప్తిపరచినావు నన్ను
సమయోచితముగా ఆదరించినావు||2||
||సన్నుతించెదను||