దొరకును సమస్తము | Dorakunu samasthamu Song Lyrics - Sis. Lillian | Jesus Songs Lyrics

Singer | Sis. Lillian |
దొరకును సమస్తము యేసు పాదాల చెంత
వెదకినా దొరకును యేసు పాదాల చెంత..."2"
యేసయ్యా..యేసయ్యా..నీకసాధ్యమైనది లేనేలేదయ్యా..
యేసయ్యా... యేసయ్యా... నీకు సమస్తము సాధ్యమేనయ్యా...
"దొరకును"
1.మగ్దలేనే మరియ యేసు పాదాలను చేరి
కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి "2"
పాదాలను ముద్దుపెట్టుకొని పూసేను విలువైన అత్తరు "2"
చేసెను శ్రేష్ఠారాధన దొరికెను పాప క్షమాపణ "2" "దొరకును"
2.యాయీరు అను అధికారి యేసు పాదాలను చేరి
బ్రతిమలుకొనెను తన పన్నెండేళ్ళ కుమార్తెకై "2"
చిన్నదాన లెమ్మని చెప్పి బ్రతికించెను యేసు దేవుడు "2"
కలిగెను మహదానందము దొరికెను రక్షణ భాగ్యము "2" "దొరకును"
3.పత్మాసు దీపమున యౌహాను యేసునుచూసి పాదాలపై పడెను
పరవశుడై యుండెను"2"
పరలోక దర్శనం చూచెను తానే స్వయముగా"2"
దొరకెను ప్రభు ముఖ దర్శనం దొరకెను ఇల మహా భాగ్యము"2"
"దొరకును"