నీ త్యాగమే నే ధ్యానించుచూ | Nee Thyaagame - Ps Suresh Lyrics

Singer | Dinesh |
Tune | Ps Suresh |
Music | Unknow |
Song Writer | Ps Suresh |
పల్లవి:
నీ త్యాగమే నే ధ్యానించుచూ
నీ కోసమే ఇల జీవించెదా ||2||
నీతిమంతుడా షాలేము రాజా ||2||నీ త్యాగమే||
ఆరాధన నీకే||3||
చరణం1.
గడియ గడియకు నిన్ను గాయపరచితి
గతమునే మరచి నిన్ను హింసించితి ||2||
అయినా విడువలేదు నీ కృపా
నన్నెన్నడు మరువలేదు నీ ప్రేమ ||2||నీ త్యాగమే||
చరణం2.
ఇహలోక ఆశలలో పడియుండగా
నీ సన్నిధి విడిచి నీకు దూరమవ్వగా||2||
అయినా విడువలేదు నీ కృపా
నన్నెన్నడు మరువలేదు నీ ప్రేమ||2||నీ త్యాగమే|
చరణం3.
హృదయమనే వాకిట నీవు నిలిచినా
నిన్ను కానకా నే కఠినుడనైతి
అయినా విడువలేదు నీ కృపా
నన్నెన్నడు మరువలేదు నీ ప్రేమ||2||నీ త్యాగమే|