ఎవరు ఉన్న లేకున్నా - M M Srilekha - Jesus songs telugu lyrics

Singer | M M Srilekha |
ఎవరు ఉన్న లేకున్నా నీవుంటే చాలు
ఎవరేమనుకున్నా నీ తోడుంటే చాలు
యేసయ్య నీవుంటే చాలయ్య
నాతో నీవుంటే చాలు నీ తోడుంటే చాలు
నీవు నాకంటే చాలు నీతో నిలిచుంటే చాలు
1. లోకంతో కలిసాను లోతు భార్యగా మారాను
పాపులతో కలిసాను ఘోరపాపిగా మారాను
రెక్కలు తెగిన పక్షిగా నశియింపబడిన వ్యక్తిగా
మరీనా జీవితం గమ్యమే అగోచరం
2. ప్రార్ధనలు చేశాను ప్రవచనాలు పలికాను
భోధలెన్నో చేశాను భాషలతో మాట్లాడాను
తోటివానిని ప్రేమించుట నీకిష్టమైనదని మరచాను
మన్నించుమా ఈ క్షణం నీ పాదమే ఆశ్రయం